Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో తాజాగా 42,367 మందికి పరీక్షలు నిర్వహించగా 193 కరోనా పాజిటివ్ కేసులొచ్చాయని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ శుక్రవారం హెల్త్ బులిటెన్లో పేర్కొంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఒకరు చనిపోయారు. మరో 1848 రిపోర్టుల కోసం ఎదురుచూస్తున్నారు. 196 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,963 యాక్టివ్ కేసులున్నాయి. జీహెచ్ఎంసీలో అత్యధికంగా 64 మందికి పాజిటివ్ అని తేలింది. కరీంనగర్ జిల్లాలో 20, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో 14 చొప్పున పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి.
జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కొమ్రం భీమ్ అసిఫాబాద్, నారాయణపేట, వికారాబాద్ జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.