Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఈ నెల 25న జరిగే టీఆర్ఎస్ ద్విదతాబ్ది ఉత్సవాల ప్లీనరీ, నవంబర్ 15న జరగనున్న తెలంగాణ రాష్ట్ర సమితి విజయ గర్జన సభకు సంబంధించిన కార్యాచరణపై ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, మంత్రి కేటీఆర్ వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. శుక్రవారం తెలంగాణభవన్‌లో వారితో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వరంగల్‌లో జరిగే సభను విజయంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అడిగి తెలుసుకున్నారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజరు, ఎంపీ కవిత, సీనియర్ నేత కడియం శ్రీవారి, ఎమ్మెల్యేలు దాస్యం వినరు భాస్కర్, తాటికొండ రాజయ్య, తదితరులు పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర తొలి హౌంశాఖ మంత్రి దివంగత నేత నాయిని నర్సింహారెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.