Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి నిరంజన్ రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
యాసంగి సీజన్లో మినుములు సాగు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు. మినుములు సాగు చేస్తే ప్రభుత్వ పరంగా పూర్తి సహకారాన్ని అందజేస్తామని తెలిపారు. మార్క్‌ఫెడ్ ద్వారా వాటిని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మార్క్‌ఫెడ్ కేంద్ర కార్యాలయంలో జరిగిన పాలక వర్గ సమావేశంలో మంత్రి మాట్లాడారు.వాటికి కనీస మద్ధతు ధర క్వింటాలుకు రూ.6300 నిర్ణయించినట్టు తెలిపారు. దేశ వ్యాప్తంగా మినములు, మినపపప్పుకు మంచి డిమాండ్ ఉందని తెలిపారు. పెసర్లు, వేరుశనగ, ఆవాలు, నువ్వులు, పొద్దు తిరుగుడు వంటి పంటలు సాగు చేయాలని కోరారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, మార్క్ ఫెడ్ చైర్మెన్ మార గంగారెడ్డి, ఎండీ పి.యాది రెడ్డి, ఇతర పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
పామాయిల్ ఫ్యాక్టరీల నిర్మాణం చేపట్టండి
తెలంగాణలో ఆయిల్ ఫామ్ సాగుకు ప్రభుత్వం కట్టుబడి వుందనీ, కేటాయించిన జిల్లాల్లో పామాయిల్ ఫ్యాక్టరీల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కోరారు. అప్పుడే ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు నమ్మకం కలుగుతుందన్నారు.
శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయిల్ఫామ్ సాగుపై సమీక్షించారు. జిల్లాల వారీగా రైతులను కొత్తగూడెం జిల్లాలోని ఆయిల్‌పామ్ క్షేత్ర సందర్శన కోసం తీసుకెళ్లి, వారికి పూర్తి అవగాహన కల్పించాలని ఆదేశించారు. సమావేశంలో ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్రెడ్డి, ఆయిల్ ఫెడ్ ఎండీ ఉన్నారు.