Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రముఖ సినీ రచయిత సుద్దాల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆదర్శ ఐఏఎస్ అధికారి ఎస్ఆర్్ శంకరన్ అనీ, ఆయన ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని సినీ రచయిత, వాగ్గేయకారులు సుద్దాల అశోక్ తేజ అన్నారు. కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యములో హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎస్ ఆర్ శంకరన్ జయంతి నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన చిత్రపటానికి సుద్దాల, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అశోక్ తేజ మాట్లాడుతూ ఎస్ ఆర్ శంకరన్ లాంటి ఆదర్శ కలెక్టర్లు ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో అవసరముందన్నారు. స్వార్దం ఎరుగని అధికారి అనీ, ప్రజాహృదయాల్లో చెరిగిపోని ముద్ర వేశారని గుర్తుచేశారు. పేదల సంక్షేమ పథకాల రూప శిల్పిగా పేరు గడించారని చెప్పారు. ఆయన స్పూర్తితో నేటి అధికారులు పేదలకు సేవ చేయాలని సూచించారు. టి స్కైలాబ్ బాబు మాట్లాడుతూ అగ్రకులంలో పుట్టి అణగారిన కులాల ఆత్మబంధువుగా మారడం ఆయన విలక్షణ వ్యక్తిత్వానికి నిదర్శనమని చెప్పారు. ఆయన స్పూర్తితోనే పిఎస్ కృష్ణన్, కె ఆర్ వేణుగోపాల్, బి డి శర్మ కాకి మాధవరావు, గోపాల్రావు వంటి వారు పనిచేశారని గుర్తుచేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు బుర్రి ప్రసాద్, డివైఎఫ్ఐ ఆలిండియా ఉపాధ్యక్షులు విజరు కుమార్, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కోటరమేష్, అన్నెగంటి వెంకటేష్, కేవీపీఎస్ నాయకులు కొమ్ము విజరు కుమార్ ,వ్యవసాయ కార్మికసంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్ ఆంజనేయులు, చెన్నయ్య పాల్గొన్నారు.