Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్, బీజేపీ నాయకుల తోపులాట
- ఎస్ఐపై దాడి చేసిన కార్యకర్త !
- కేసు నమోదు చేసిన పోలీసులు
నవతెలంగాణ - ఇల్లందకుంట
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామంలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య శుక్రవారం రాత్రి ఘర్షణ జరిగింది. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించగా.. టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం వ్యతిరేకంగా నినాదాలు చేసుకున్నారు. ఒకరిపైకి ఒకరు దూసుకుపోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. అడ్డుకొనేందుకు యత్నించిన ఎస్ఐపై ఒకరు చేయి చేసుకోవడంతో ఘర్షణ తీవ్రస్థాయికి చేరింది. దీనితో పోలీసులు ఇరు పార్టీల నాయకులుకు నచ్చజెప్పి పంపారు. ఈ ఘర్షణ పట్ల కేంద్రమంత్రి కిషన్రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరు పార్టీల కార్యకర్తలను శాంతింపజేసే ప్రయత్నం చేసిన శిక్షణ ఎస్ఐపై అధికార పార్టీ కార్యకర్త దాడి చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలో శిక్షణ ఎస్ఐ ఫిర్యాదు మేరకు సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తోట తిరుపతి తెలిపారు.