Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ ఏడాది 25% వృద్థి లక్ష్యం
- బీఓబీ ఉన్నతాధికారి మన్మోహన్ గుప్తా వెల్లడి
హైదరాబాద్: బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) ప్రపంచ ఆహార దినోత్సవాన్ని పురస్కరించుకుని రైతు పక్షోత్సవాలు నిర్వహిస్తుంది. దేశంలో నాలుగో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌గా ఉన్న తాము పక్షం రోజుల పాటు నిర్వహించే ఈ బరోడా కిసాన్ పక్వాడాలో రైతు రుణాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని హైదరాబాద్ జోన్ జనరల్ మేనేజర్ మన్మోహన్ గుప్తా తెలిపారు. శుక్రవారం ఇక్కడి కార్యాయలంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమం అక్టోబర్ 31తో ముగుస్తుందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రైతులకు ఇచ్చే రుణాల్లో 25 శాతం వృద్ధిని నమోదు చేయాలని నిర్దేశించుకున్నామన్నారు. సంప్రదాయేతర వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయ మార్కెటింగ్ వంటి వాటికి ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. వ్యవసాయ రంగంలో పసిడి రుణాలు, స్వయం సమృద్ధి సంఘాలకు ఇచ్చే రుణాలకు బీఓబీ ప్రాధాన్యతనిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని తమ జోన్ ఇప్పటి వరకు రూ. 9700 కోట్ల వ్యాపారాన్ని నమోదు చేసిందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో బీఓబీకి 397 శాఖలున్నాయన్నారు. మొండి బాకీల రికవరీలో తాము ఇప్పటికే లక్ష్యాన్ని చేరామన్నారు.