Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాయింట్ సర్వే చేపట్టాలి
- అటవీశాఖ అధికారుల తీరుపై దళితుల రాస్తారోకో
నవతెలంగాణ-లింగంపేట్
రెవెన్యూ శాఖ భూమిని సాగు చేస్తుంటే అటవీశాఖ అధికారులు అడ్డుపడి 10 మంది దళితులను అరెస్టు చేశారని, వారిని వెంటనే విడుదల చేయాలని దళితులు డిమాండ్ చేశారు. భూముల జాయింట్ సర్వే చేపట్టాలని కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలోని భవానిపేట్ గ్రామ దళితులు శుక్రవారం ఎల్లారెడ్డిలో రాస్తారోకో చేపట్టారు. రెవెన్యూ భూమిని చదును చేస్తుండగా అన్యాయంగా తమ వాళ్లను అరెస్టు చేశారని వాపోయారు. ఒక వైపు ప్రభుత్వం దళితుల అభ్యున్నతికి కృషి చేస్తామని ప్రకటిస్తుంటే.. మరోవైపు అధికారులు తమను వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు 100 ఎకరాల అటవీ భూమిని చదును చేసి సాగు చేసుకుంటున్నా ఫారెస్ట్ అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరించారని విమర్శించారు. తాము అటవీ భూమిని సాగు చేయకపోయినా అక్రమంగా అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాస్తారోకో విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి సీఐ రాజశేఖర్ అక్కడికి చేరుకొని వారిని సముదాయించారు.