Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధి హామీ కూలీలకు సరైన కూలి కల్పిస్తాం
- ఉపాధి హామీ చట్టం కేంద్ర బృందం సభ్యులు ప్రొఫెసర్ సౌందర్ పాండియన్
నవతెలంగాణ-కందుకూరు
గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుందని జాతీయ ఉపాధి హామీ చట్టం కేంద్ర బృందం సభ్యులు ప్రొఫెసర్ డాక్టర్ సౌందర పాండియన్ అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా కందుకూర్ మండలం గుమ్మడవెల్లి గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ చట్టం ద్వారా చేపట్టిన పనులతో పాటు గ్రామంలో అభివృద్ధి చెందుతున్న కాలనీలు, మొక్కలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ కూలీలకు అదనంగా కూలి ఇవ్వడంతో పాటు వారి సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. వృద్ధాప్య పింఛన్లు, ఒంటరి మహిళా పింఛన్లు మంజూరు గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలనీ, చెత్తను చెత్త బుట్టలో వేయాలని సూచించారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వ అధికారులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ డీఆర్డీఓ జంగారెడ్డి, డీపీఎం సూరజ్, ఈసీశ్వేత, ఎంపీపీ మంద జ్యోతి వైస్ ఎంపీపీ గంగుల శమంత, సర్పంచ్ గౌర ప్రభాకర్, ఎంపీటీసీ రేఖ, ఎంపీడీవో నరసింహులు, ఎంపీఓ విజయలక్ష్మి, ఏపీ రవీందర్ రెడ్డి, ఈసీ రవికుమార్, టెక్నికల్ అసిస్టెంట్, తదితరులు పాల్గొన్నారు.