Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదేండ్లయినా పాఠశాల బోర్డుపై జిల్లా పేరు మార్చారా!
నవతెలంగాణ-గార్ల
విద్యార్థికి అన్ని రకాల జ్ఞానం పాఠశాల గదిలోనే అందుతుందన్న నానుడికి విరుద్ధంగా మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాల నడుస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని సత్యనారాయణపురం గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్త తండా గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల బోర్డుపై ఇప్పటికీ ఉమ్మడి ఖమ్మం జిల్లా పేరుతో బోర్డు ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేయగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గార్ల మండలాన్ని 2016లో కొత్తగా ఏర్పాటుచేసిన మహబూబాబాద్ జిల్లాలో కలిపారు. అప్పటినుంచి దాదాపు ఐదేండ్లు గడుస్తున్నా పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న గురువులు ప్రస్తుత జిల్లా పేరును పాఠశాల బోర్డుపై మార్చకపోవడం పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత పాఠశాలకు ఉపాధ్యాయులు ప్రస్తుత జిల్లా పేరుతో పాఠశాల బోర్డు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.