Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గుజరాత్‌లోని నేషనల్ ఫోరెన్సిక్ విశ్వవిద్యాలయంలో సాంఘిక, గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ సంస్థలకు చెందిన 14 మంది విద్యార్థులు ప్రవేశం పొందారని ఆ సంస్థల కార్యదర్శి రొనాల్డ్ రోస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇది విద్యార్థుల కెరీర్‌కు ఒక గొప్ప మెట్టులాంటిదని పేర్కొన్నారు. 14 మంది విద్యార్థుల్లో పది మంది సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ సంస్థల నుంచి, మిగిలిన నలుగురు గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థలనుంచి ఎంపికయ్యారని తెలిపారు. ఎంపికైన విద్యార్థులు యూనివర్సిటీలో ఎంటెక్ ( సైబర్ సెక్యూరిటీ) ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సును అభ్యసిస్తారని పేర్కొన్నారు. సాంఘిక,గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ విద్యార్థులు నైపుణ్యం కలిగిన ప్రపంచ నిపుణులుగా మారడానికి కొత్త మార్గాలను వెతుకుతున్నారని తెలిపారు. ఇందుకు అన్ని రకాలుగా సహాయం అందించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.