Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గతేడాది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై తన ప్రభావాన్ని చూపిన కరోనా... ఇప్పుడు హుజూరా బాద్‌లో సీఎం కేసీఆర్ సభలపైనా తన ఎఫెక్టును చూపెడుతున్నది. కొద్ది నెలల క్రితం జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కోవిడ్ కేసులు విపరీ తంగా పెరిగాయి. ఈ కారణంగా ఇప్పుడు హుజూ రాబాద్ ఉప ఎన్నికలో విధిగా కరోనా నిబంధనలను పాటించాలంటూ ఎన్నికల సంఘం (ఈసీ) ఆదేశిం చింది. కేవలం ఐదొందల నుంచి వెయ్యి మందితోనే సభలు, సమావేశాలు, ప్రచారాలు నిర్వహించుకో వాలంటూ పార్టీలకు సూచించింది. దీంతో దాదాపు లక్ష మందితో నియోజకవర్గంలో నిర్వహించాలకున్న సీఎం కేసీఆర్ సభను టీఆర్ఎస్ రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఫలితంగా క్షేత్రస్థాయిలోని కార్యకర్తలు, నాయకుల ఉత్సాహం నీరు గారింది. ఈ క్రమంలో బహిరంగ సభకు ప్రత్యామ్నాయంగా రోడ్ షోలను నిర్వహించాలంటూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలు అధినేతను కోరారు. ఇందుకనుగుణంగా ఏర్పాట్లు చేసుకునేందుకు అనుమతినివ్వాలంటూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. అయితే దీనిపై ఇప్పటి వరకూ వారిరువురూ ఎలాంటి స్పష్టతనివ్వలేదని సమాచారం. గతంలో దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా సీఎం కేసీఆర్ అక్కడ ప్రచారంలో పాల్గొనలేదు. ఆ ఎన్నికలో తన సిట్టింగ్ స్థానాన్ని టీఆర్ఎస్ కోల్పోయింది. ఆ తర్వాత నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సందర్భంగా దుబ్బాక అనుభవాన్ని గుర్తు చేసుకున్న నల్లగొండ టీఆర్ఎస్ నేతలు... కచ్చితంగా బహిరంగ సభను నిర్వహించాలనీ, దానికి కేసీఆర్ తప్పకుండా రావాలని అభ్యర్థించారు. దాంతో సీఎం... హాలియాలో నిర్వహించిన సభలో పాల్గొని ప్రసంగించారు. ఆ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలిచింది. ఈ రెండు అనుభవాల దృష్ట్యా ఇప్పుడు హుజూరాబాద్‌కు కూడా గులాబీ దళపతిని ఎలాగోలా రప్పించాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలు తాపత్రాయపడుతున్నారు. కానీ ఈసీ ఆదేశాలతో అది సాధ్యం కావటం లేదు. ఈ నేపథ్యంలోనే రోడ్‌షోలకు వారు ప్లాన్ చేస్తున్నారు. కానీ ఉద్యమ సమయంలోగానీ, ఆ తర్వాత సీఎం అయ్యాకగాని కేసీఆర్... రోడ్‌షోలలో పాల్గొన్న దాఖల్లాలేవు. ఆయనకు బహిరంగ సభలపైనే మక్కువ ఎక్కువ. అది కూడా 50 వేల నుంచి లక్ష మంది తగ్గకుండా జనం ఉండాల్సిందే. ఈ క్రమంలో రోడ్‌షోల బాధ్యతను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే సమర్థవంతంగా పోషిస్తూ వస్తున్నారు. అందువల్ల ఇప్పుడు బహిరంగ సభతోపాటు రోడ్ షోలూ రద్దవుతాయా..? లేక కేసీఆర్‌ను బతిమిలాడుకోవటం ద్వారా అక్కడి నేతలు ఆయన్ను రప్పించుకుంటారా..? అనేది వేచి చూడాలి. లేదంటే షరా మామూలుగా మళ్లీ కేటీఆరే వాటిని కొనసాగిస్తారా...? అనేది కూడా ఇంకా తేల్లేదు. ఒకవేళ ఇవేవీ కాకపోతే ఇప్పుడు ట్రబుల్ షూటర్ హరీశ్‌రావు కొనసాగిస్తున్న సభలతోనే ప్రచారం ముగుస్తుందా..? అనేది కూడా చూడాలి. సోమవారం నిర్వహించబోయే ప్లీనరీ తర్వాత వీటన్నింటిపై స్పష్టత వచ్చే అవకాశముందని టీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఒకరు అభిప్రాయపడ్డారు.