Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎఫ్టీసీసీఐ సమావేశంలో శ్రీకార్ కె.రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మన దేశ ఎగుమతులు 2027-28 ఆర్థిక సంవత్సరానికి ఒక ట్రిలియన డాలర్లకు చేరుకునే అవకాశముందని సీనియర్ ఐఎఫ్ఎస్, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ శ్రీకార్ కె.రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ (ఎఫ్టీసీసీఐ) ఆధ్వర్యాన శనివారం ఆన్లైన్ వేదికగా జరిగిన బృంద చర్చల్లో ఆయన పాల్గొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 400 అమెరికన్ బిలియన్ డాలర్ల ఎగుమతులు లక్ష్యంగా కేంద్రం ప్రణాళికలు రచించిందని తెలిపారు. ఎఫ్టీసీసీఐ అధ్యక్షుడు కె.భాస్కరరెడ్డి మాట్లాడుతూ... నైపుణ్యాభివృద్ధిపై తమ సంస్థ నిరంతర కార్యక్రమాలను నిర్వహించిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎఫ్టీసీసీఐ ప్రతినిధులు గౌతమ్ జైన్, వెంకట్ జాస్తి, రాజేంద్ర అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.