Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రచయిత, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు జూలూరు గౌరీశంకర్ సంపాదకత్వంలో రూపొందించిన 'ఆత్మబంధువు - దళిత సంక్షేమ బంధం..' పుస్తకాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం ప్రగతి భవన్ లో ఆవిష్కరించారు. దళితబంధుపై జరుగుతున్న ప్రగతిశీల కృషినంతా ఈ పుస్తకంలో పొందుపరిచినట్లు జూలూరి తెలిపారు. అనంతరం, తమ కుమార్తె వివాహానికి హాజరు కావాలని ముఖ్యమంత్రికి జూలూరు గౌరీశంకర్ దంపతులు శుభపత్రిక అందజేసి, ఆహ్వానించారు.