Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు సెకన్ల పాటు కంపించిన భూమి
- ఇండ్లలోంచి పరుగులు తీసిన జనం
నవతెలంగాణ-మంచిర్యాల, జైపూర్
ఒక్కసారిగా పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో జనం ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం అని తెలుసుకుని ఉలిక్కిపడ్డారు. శనివారం మధ్యాహ్నం మంచిర్యాల జిల్లాలో సంభవించిన భూకంపంతో ప్రజలు భయంతో వణికిపోయా రు. తొలుత ఉపరితల గనుల్లో పేలుడు అని భావించినప్పటికి మొదటి షిప్టు పూర్తికావస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో జనం భయాందోళనకు గురయ్యారు. విచ్చలవిడిగా గనులు తవ్వేసి, వాటిలోని బొగ్గును ఖాళీ చేసి వదిలేశాక, అవి కుప్పకూలిన సందర్భాల్లో స్వల్పస్థాయి భూకంపాలు సంభవిస్తుంటాయి. భూగర్భంలో అణుపరీక్షలు నిర్వహించడం వల్ల కూడా భూకంపాలు సంభవిస్తాయి. డ్యాముల వెనుక రిజర్వాయర్లలో భారీ పరిమాణంలో నీటిని నిల్వచేయడం వల్ల ఏర్పడే ఒత్తిడి కారణంగా కూడా భూకంపాలు సంభవించే ప్రమాదాలు ఉన్నాయి. అయితే మంచిర్యాల చుట్టూ ఉన్న బొగ్గు గనులతో పాటు ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఎల్లప్పుడూ నీరు నిల్వ ఉండటంతో ఈ భూకంపం సంభవించడానికి కారణమై ఉండొచ్చని ప్రజలు భావిస్తున్నారు.జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం సమయంలో సంభవించిన భూకంపంతో పట్టణవాసులు ఆందోళనకు గురయ్యారు. చున్నంబట్టి వాడ, శ్రీశ్రీనగర్తో పాటు సీతారాంపల్లి, నస్పూర్, సీతారాంపూర్, సీసీసీి ప్రాంతాల్లో భూకంపం తీవ్రతతో ఉలిక్కిపడ్డారు. కొన్ని ప్రాంతాల్లో 2 సెకన్లు, మరికొన్ని చోట్ల మూడు సెకన్ల పాటు భూకంప ప్రభావం కనిపించింది.ఒక్కసారిగా కిందపడినట్టుగా అనిపించిందని, భయంతో పరుగులు తీశామని ప్రజలు చెబుతున్నారు. జైపూర్ మండల పరిధి ఇందారం,రామారావుపేట్ ఈ ప్రభావానికి గురయ్యాయి. భూమి కంపిం చడంతో ఇండ్లలో సామాన్లు కింద పడ్డాయని, కూర్చున్న వారిని కదిపినట్టు అయిందని రామారావుపేట్, ఇందారం గ్రామాలకు చెందిన వారు అన్నారు.