Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 25 నుంచి ప్రిన్సిపాళ్లను సంప్రదించండి : విద్యాశాఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో 2021-22 విద్యాసంవత్సరంలో ఆరు నుంచి పదో తరగతి వరకు, ఇంటర్మీడియెట్ కోర్సుల్లో మిగిలిపోయిన సీట్లను భర్తీ చేయాలని నిర్ణయించామని మోడల్ స్కూళ్ల ప్రాజెక్టు అదనపు డైరెక్టర్ జి ఉషారాణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి పెద్దఎత్తున డిమాండ్ ఉందని పేర్కొన్నారు. తొలివిడత ప్రవేశాల తర్వాత కొన్ని మోడల్ స్కూళ్లలో సీట్లు మిగిలిపోయాయని వివరించారు. వాటిని భర్తీ చేసేందుకు ప్రిన్సిపాళ్లకు అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు ప్రవేశాల కోసం ఈనెల 25 నుంచి వచ్చేనెల 3 వరకు ప్రిన్సిపాళ్లను సంప్రదించాలని కోరారు. విద్యార్థులు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులకు పరీక్ష నిర్వహించి ఎంపిక చేయాలని ప్రిన్సిపాళ్లను ఆదేశించారు.