Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నా జీవితం తెలంగాణకు అంకితం
- మహా ప్రస్థానం పాదయాత్రలో షర్మిల
నవతెలంగాణ-శంషాబాద్
తెలంగాణలో కేసీఆర్ పాలన పోవాలని వైఎస్సార్ సంక్షేమ పాలన రావాలని అప్పుడే తెలంగాణ ప్రజల జీవితాలు బాగుపడతాయని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల అన్నారు. తన జీవితం తెలంగాణ ప్రజలకు అంకితమని చెప్పారు. ప్రజలు అనేక సమస్యలతో బాధపడుతుంటే పట్టించుకోకుండా గాడిదలు కాస్తున్నారా లేక ఫామ్‌హౌస్ నిద్రపోయారా అంటూ ప్రశ్నించారు. శనివారం నాలుగో రోజు మహాప్రస్థానం పాదయాత్ర రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని పోశెట్టిగూడ, కొత్తగూడ, రషీద్‌గూడ, హమిదుల్లానగర్, చిన్న గోల్కొండ, సంఘీగూడ నుంచి పెద్ద గోల్కొండ వరకు దాదాపు 13 కిలోమీటర్లు సాగింది. పెద్ద గోల్కొండలో మహిళలతో షర్మిల మాట్లాడారు. నిరుద్యోగ యువతి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఒక్క టీచర్ ఉద్యోగం కూడా భర్తీ చేయలేదని, ఇందుకోసమేనా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది అని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. పేద విద్యార్థుల చదువుల కోసం వైఎస్ఆర్ కాలంలో ఫీజురీయింబర్స్‌మెంట్, రైతులకు రుణమాఫీ చేస్తే.. కేవలం మూడు లక్షల మందికి మాత్రమే కేసీఆర్ రుణమాపీ చేస్తానని చెప్పి, అది కూడా చేయడం లేదన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన బతుకమ్మ చీరలు పేపర్ ఉన్నట్టుగా ఉన్నాయని, అయినా ప్రజలు చీరలు అడగలేదని ఉద్యోగాలు అడిగారని, వెంటనే ఉద్యోగాల భర్తీ చేపట్టాలని డిమాండ్ చేశారు. దేశంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్లు పెట్రోల్ ధరలు పెంచి ప్రజలను దోచుకుంటున్నాయని విమర్శించారు. పరిపాలన చేతగాని సీఎం కేసీఆర్‌ను గద్దె దించాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీని ఆశీర్వదిస్తే వైఎస్ఆర్ పాలన మళ్లీ తీసుకొస్తామని తెలిపారు. ఉచిత విద్య, వైద్యం, నిరుద్యోగులకు నోటిఫికేషన్లు, మహిళలకు ఆత్మగౌరవం, మంచి భవిష్యత్తును అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్టీపీ నేతలు ఏపూరి సోమన్న, అక్రం ఖాన్, డేవిడ్, తదితరులు పాల్గొన్నారు.