Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీశ్‌రావు
- గవర్నమెంట్‌ను ఎందుకు కూలగొడతవు అంటూ ఈటలకు ప్రశ్నల వర్షం
నవతెలంగాణ జమ్మికుంట
రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు కూల కొడతావ్ రాజేందర్.. - రూ.2016 పింఛన్ ఇచ్చినందుకా.. రూ.10వేలు రైతుబంధు, రూ.లక్ష కల్యాణ లక్ష్మి ఇచ్చినందుకా? వ్వవసాయానికి 24గంటల కరెంటు ఇచ్చినందుకా అని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై మంత్రి హరీశ్‌రావు ప్రశ్నల వర్షం కురిపించారు. శనివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా జమ్మికుంట మండలంలోని శాయంపేట, నాగంపేట, గండ్రపల్లి, తనుగుల తదితర గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు. ఈ సంందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండేండ్ల నాలుగు నెలల కోసం ఎన్నుకోబోతున్నాం.. మనకు సాయం చేసే చేయేది.. అన్నం పెట్టేవారెవరు అన్నది ఆలోచించాలన్నారు. బీజేపీ వాళ్లు తిట్టడమే పనిగా పెట్టుకున్నారని, అబద్దాలు చెప్పే బీజేపీ కావాలా.. నమ్మకాలు నిలబెట్టే టీఆర్ఎస్ కావాలా ప్రజలు ఆలోచించుకోవాలని అన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేవని అన్నారు.
రైతులకు వానాకాలం 7500కోట్ల రైతుబంధు ఇచ్చామని, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ప్రభుత్వోద్యోగులకు జీతాలు నిలిపివేసి మరీ రైతుబంధు డబ్బులు ఇచ్చామని తెలిపారు. 57ఏండ్లు నిండిన వారందరికీ రెండు మూడు నెలల్లో రూ.2016 పింఛన్ పంపిణీ చేస్తామన్నారు. పండుగ పూట వడ్డీ లేని రుణం ఇచ్చినమా లేదా..? నియోజకవర్గ మహిళలను అడిగితే నిజం తెలుస్తుందన్నారు. చెల్లని చెక్కులు ఇచ్చిండ్రని ఈటల అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ పన్నుల పేరుతో సామాన్యుడిపై విపరీతమైన భారం మోపిందన్నారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తక్కువగా ఉన్నప్పుడూ మన దగ్గర ధరలు ఎందుకు తగ్గలేదో చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని ప్రశ్నించారు. ఈవారం రోజులు బీజేపీ నాయకులు ఎంత రెచ్చగొట్టినా సంయమనంతో ఉండాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే మండల ఇన్చార్జి ఆరూరి రమేష్, జెడ్పీటీసీి శ్రీరామ్ శ్యామ్, రైతుబంధు జిల్లా కమిటీ సభ్యులు కనపర్తి లింగారావు, నాగంపేట సర్పంచ్ చందుపట్ల కృష్ణారెడ్డి, మాజీ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు కట్కూరి యుగంధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.