Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్లీనరీ ఏర్పాట్లు పర్యవేక్షించిన మంత్రి కేటీఆర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
స్వరాష్ట్ర సాధన పోరాటం, పరిపాలన రెంటినీ సమన్వయం చేస్తూ 20 ఏండ్లలో తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయామని రాష్ట్రమంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారకరామారావు అన్నారు.శనివారంనాడాయన హైటెక్స్‌లో పార్టీ ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, పాలనకు దేశంలోని ఇతర రాష్ట్రాలు, పొరుగు రాష్ట్ర ప్రజాప్రతినిధులు సైతం తెలంగాణలో తమనూ కలుపుకోవాలని డిమాండ్ చేస్తున్నారనీ, దీన్నిబట్టే రాష్ట్రంలో పాలన ఎంత అద్భుతంగా సాగుతుందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు.
ఈటల ఉమ్మడి అభ్యర్థి
కాంగ్రెస్ బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఈటల రాజేందర్ హుజురాబాద్ లో పోటీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇది కాదని వారు చెప్తే దానికి అవసరమైన సాక్ష్యాలను తానే బయటపెడతానని చెప్పారు. కరీంనగర్ నిజామాబాద్, నాగార్జునసాగర్ ఎన్నికల్లో చీకటి ఒప్పందం తో పోటీ చేశాయో... ఇప్పుడూ అదే చేస్తున్నాయన్నారు.