Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రమాణాలు పాటించాలి
- డాక్టర్ బి.ఎన్.త్రిపాఠి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆహార ఉత్పత్తుల్లో నాణ్యత, ప్రమాణాలను పాటించాలని ఐసీఎంఆర్ డిప్యూటీ డైరక్టర్ డాక్టర్ బి.ఎన్. త్రిపాఠి కోరారు. స్టార్టప్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అనేక ప్రయోజనాలను కల్పిస్తున్నదని వివరించారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఐసీఎంఆర్- ఎన్ఆర్సీఎం కేంద్రాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఎన్‌ఆర్‌సిఎం భాగస్వామ్యంతో కలిసి పనిచేస్తున్న స్టార్టప్ సంస్థల నిర్వాహకులతో భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో ఐసీఎంఆర్-ఎన్ఆర్సీఎం డైరక్టర్ డాక్టర్ ఎస్.బి. బర్బుద్దేతో పాటు పలు స్టార్టప్ సంస్థల నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టార్టప్‌ల నిర్వహణ, మార్కెట్ పరిస్థితులు, ప్రభుత్వ పరంగా అందాల్సిన సహాయం తదితర అంశాలపై వారిని అడిగి తెలుసుకున్నారు. ఉత్పత్తులను కూడా పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న స్వయం ఉపాధి పథకాలను, సబ్సిడీలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఇప్పటి వరకు వాటిని పొందిన సంస్థల పనితీరు, వారి ఉత్పత్తలు , వ్యాపారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బ్రాండ్ ఎఫ్ టు ఎఫ్ ఫామ్ టూ ఫోక్ సంస్థ మెనేజింగ్ పాట్నర్ అబ్దుల్ బసీత్ స్టార్టప్‌ల పరిస్థితులు, మార్కెట్లో ఎదురవుతున్న సవాళ్ల ను వివరించారు. తమ సంస్థ ప్రారంభించి నిలదొక్కుకుంటున్న తరుణంలో కరోనా వైరస్, లాక్‌డౌన్‌తో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నామనీ, ఇలాంటి పరిస్థితుల్లో తమకు మార్కెటింగ్ సదుపాయం తదితర అంశాల్లో కేంద్ర ప్రభుత్వ సహాయం, సహకారాన్ని అందించాలని కోరారు. తమ సంస్థను విస్తరించనున్నామని తెలిపారు.