Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ కు జాజుల సూటి ప్రశ్న
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీఆర్ఎస్ మొత్తం సభ్యత్వాలు 60 లక్షలైతే, అందులో 50 లక్షల మంది సభ్యులు బీసీలేనని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ క్రమంలో సభ్యత్వాలు మావి? పగ్గాలు మాత్రం కేసీఆర్ కేనా? అంటూ ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం సీఎంకు బహిరంగలేఖ రాశారు. టీఆర్ఎస్కు ఏడుసార్లు కేసీఆర్ అధ్యక్షులయ్యారనీ, ఒక్కసారి కూడా బీసీలకివ్వలేదని చెప్పారు. ఈ సారైనా ఆ సామాజిక వర్గానికి అవకాశమివ్వాలని డిమాండ్ చేశారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రొఫెసర్ జయశంకర్ టీఆర్ఎస్ పార్టీకి ఊపిరి పోశారనీ, కొండా లక్ష్మణ్ బాపూజీ తన సొంత ఇంటిని పార్టీ కార్యాలయానికి ఇచ్చారనీ, ఢిల్లీలో టిఆర్ఎస్ పార్టీకి టైగర్ నరేంద్ర ప్రాణం పోశారనీ ,కాసోజు శ్రీకాంతాచారి తదితరుల బలిదానాలు ఆ పార్టీని అధికారంలో కూర్చోబెట్టారని ఆయన అన్నారు.