Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'ఎన్ఎఫ్డీబీ'లో కేంద్ర మంత్రి మురుగన్ వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
దేశంలో పెద్దఎత్తున సముద్రపు నాచును పెంచేందుకు తగిన చర్యలు తీసుకుంటామనీ, తద్వారా మత్స్యకారులకు ఉపాధి దొరుకుతుందని కేంద్ర మత్స్య,పశుసంవర్థక, పాడిపరిశ్రమల శాఖ సహాయమంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ చెప్పారు. ఇందులో భాగంగా దేశమంతటా యూనిట్లను ఏర్పాటు చేసేందుకు తగిన స్థలాలను గుర్తిస్తామని తెలిపారు. ఆదివారం హైదరాబాద్లోని జాతీయ మత్స్య పరిశ్రమాభివృద్ధి సంస్థ (ఎన్ఎఫ్డీబీ)ను మంత్రి సందర్శించారు. 'ఎన్ఎఫ్డీబీ' ఆర్థిక సహాయంతో చేపట్టిన, అమలు చేస్తున్న కార్యకలాపాలను సమీక్షించారు. సముద్రపు నాచు, పంజరాల్లో చేపల పెంపకంతో మత్స్యకారులకు, మహిళలకు ఉపాధి అవకాశాలు పెరుగుతు న్నాయని తెలిపారు.'ఔషధ విలువలున్న సముద్రపు నాచుకు జాతీయంగా, అంతర్జాతీయంగా ఎంతో గిరాకీ ఉంది. సముద్రపు నాచు పెంచడం మత్స్యకారులు,ప్రత్యేకించి మహిళల సాధికారతకు ఎంతగానో తోడ్పడుతుంది' అని మంత్రి చెప్పారు. చేపలవేట ద్వారా మత్స్యకారుల ఆదాయాన్ని పెంచడ ం కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. చేపలవేట కార్యకలాపాలకు ప్రోత్సాహం ఇచ్చేందుకు స్వయం సమృద్ధి భారత్ ప్యాకేజీ కింద రూ 20వేల కోట్లు కేటాయించిందన్నారు. ఈ నిధులతో ల్యాండింగ్ సెంటర్లు,ఫిషింగ్ హార్బర్లు, ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజీ సదుపా యాల అభివద్ధి, ఆధునికీకరణకు చర్యలు చేపడతామని వివరించారు. మత్స్యకారులందరికీ త్వరలోనే 'కిసాన్ క్రెడిట్ కార్డ్' జారీ చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు.