Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దక్షిణమధ్య రైల్వే జీఎమ్ గజానన్మాల్యా
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) జోన్ పరిధిలో 500కు పైగా కిసాన్ రైళ్ల ద్వారా తూర్పు, ఉత్తర, ఈశాన్య ప్రాంతాలకు 1.6 లక్షల టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేసినట్టు ఎస్సీఆర్ జనరల్ మేనేజర్ గజానన్మాల్యా తెలిపారు. జోన్ పరిధిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల్లోని వేర్వేరు రైల్వే స్టేషన్ల నుండి ఈ రైళ్లు నడిపినట్టు వివరించారు. దేశంలోని తూర్పు, ఉత్తర, ఈశాన్య ప్రాంతాలకు ఈ వ్యవసాయ ఉత్పత్తులను రవాణా జరిగినట్టు చెప్పారు. కిసాన్ రైళ్ల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను చేరవేయడంలో సరుకు రవాణా చార్జీల్లో 50శాతం రాయితీ ఇస్తున్నట్టు తెలిపారు. ఈ రైళ్లతో ప్రత్యేకించి కోవిడ్ మహమ్మారి సమయంలో రైతులకు, వ్యాపారస్తులకు వారి ఉత్పత్తులకు మంచి మార్కెట్ లభించడానికి ప్రయోజనం చేకూరిందన్నారు. మహారాష్ట్ర నుంచి 350, ఆంధ్రప్రదేశ్ నుంచి 78, తెలంగాణ నుంచి 63 కిసాన్ రైళ్లను నడిపినట్టు వివరించారు.