Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో ఎన్వి భాస్కర్రావు 37వ వర్థంతిని ఆదివారం నిర్వహించారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్వి భాస్కర్రావు చిత్రపటానికి ఆ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.రాజారావు పూలమాల వేసి నివాళి అర్పించారు. భాస్కర్రావు న్యాయవాది వృత్తిని కొనసాగిస్తూనే సీఐటీయూ బలోపేతం కోసం పనిచేశారని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల యూనియన్ల స్థాపనలో కీలక పాత్ర పోషించారనీ, కడవరకూ కష్టజీవుల హక్కుల కోసం పోరాడిన యోధుడని కొనియాడారు. 1956లో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ శాసనసభ పక్ష కార్యాలయ ఇన్చార్జిగా పనిచేశారన్నారు. నేటి తరం నాయకులంతా ఎన్వి భాస్కర్రావు ఆశయ సాధనలో నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు పి.శ్రీకాంత్, పి.సుధాకర్, ఎ.సునీత, తదితరులు పాల్గొన్నారు.