Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'గాంధీ ఆత్మను చంపే ప్రయత్నం'.
- తెలంగాణ సర్వోదయ మండలి అధ్యక్షులు
ఆర్.శంకర్ నాయక్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అహింసా బోధనలకు, శాంతి, ప్రశాంతతలకు నిలయమైన సబర్మతీ ఆశ్రమం పునరుద్ధరణ ప్రాజెక్ట్ చేపట్టడం 'గాంధీ ఆత్మను చంపే ప్రయత్నం' అని తెలంగాణ సర్వోదయ మండలి అధ్యక్షులు ఆర్.శంకర్ నాయక్ విమర్శించారు. సబర్మతి ఆశ్రమంగా ప్రసిద్ధి చెందిన అహ్మదాబాద్ గాంధీ ఆశ్రమం పునర్నిర్మాణం చేపట్టడాన్ని నిరసిస్తూ తెలంగాణ సర్వోదయ మండలి ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్, అంబెద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శనను నిర్వహిచారు. గాంధీ ఆశ్రమాన్ని రక్షించండి - శాంతిని కాపాడండి, అహింస, శాంతి గాంధేయ భావజాలం వ్యాపారం కాదు, గాంధేయ వారసత్వాన్ని వాణిజ్యప రం చేయటాన్ని ఆపండి, సబర్మతి ఆశ్రమాన్ని పునరుద్ధరణను ఆపండి అని రాసున్న ప్లకార్డులు చేతబూని, నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని శాంతియు తంగా ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్బంగా శంకర్ నాయక్ మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో సబర్మతి గాంధీ ఆశ్రమం కీలక పాత్ర పోషించిందనీ, ఉద్యమంలో కీలక ఘట్టాలయిన ఉప్పు సత్యాగ్రహం, దండి యాత్ర తదితర ఉద్యమాలు ఇక్కడి నుంచే ప్రారంభమ య్యాయని అన్నారు. జాతీయ స్మారక స్థలంగా ఉన్న గాంధీ ఆశ్రమాన్ని పునర్నిర్మాణం పేరట ''ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా'' మారుస్తున్న ప్రధాని మోడీ తన స్వార్థ కార్పొరేట్ వ్యాపార స్నేహితుల ప్రయోజనాల కోసం ఈ దుర్మార్గమైన పని చేపట్టాడని అయన ఆరోపించారు. గాంధీ ఆశ్రమ సంస్థలను, ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఇందులో పునర్నిర్మాణ ప్రణాళికల ప్రకారం హౌటళ్లు,గెస్ట్ హౌసులు, అమ్యూజ్మెంట్ పార్క్‌లు, యాంఫిథి యేటర్, ఫుడ్ కోర్టులు, షాపులు నిర్మించి వాణిజ్యప రం చేస్తే అసాంఘిక కార్యకలాపాలకు నిలయమైపో తుందని అయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రదర్శనలో తెలంగాణ సర్వోదయ మండలి ప్రతినిధు లు కె.చందు నాయక్, ఎన్.రూప్ సింగ్, రాకేష్ సింగ్, వి.పి. రాజు, బి. భాస్కర్, చత్రు నాయక్, మహమూద్, శంకర్, అమీనా, విజరు కుమార్, షమ, దశరథ్, రాజు తదితరులు పాల్గొన్నారు.