Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో మాదకద్రవ్యాల ఉనికి లేకుండా చేయాలని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మత్తును చిత్తు చేసి, యువత బానిసలు కాకుండా చూడాల్సిన బాధ్యత ఎక్సైజ్ శాఖ అధికారులదేనని స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్ లోని తన క్యాంప్ కార్యాలయంలో అంతర్జాతీయ మార్కెట్లో రూ.2 కోట్ల విలువైన సుమారు 5 కిలోల మెపిడ్రిన్ డ్రగ్ ను పట్టుకొని సీజ్ చేసిన అబ్కారీ శాఖ అధికారులను ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మత్తు పదార్థాలను తయారీ, రవాణా, అమ్మకాలు చేస్తున్న, వినియోగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆంధ్ర - ఛత్తీస్ ఘడ్, ఒరిస్సాల నుంచి గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాలను తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్లకుండా సరిహద్దుల్లో గట్టి నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీనికోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశామన్నారు.