Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుటుంబ కలహాలే కారణం
నవతెలంగాణ-డిచ్పల్లి
అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవ ప్రాణాల మీదకు తెచ్చింది. కుటుంబ కలహాలతో తమ్ముడు తన అన్న గొంతు కోశాడు. పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం బర్దిపూర్ గ్రామానికి చెందిన షేక్మతిన్ తరుచూ మద్యం సేవించేవాడు. మద్యం మత్తులో ఇంటికి వచ్చి తల్లిదండ్రులు, తమ్ముడితో తరుచూ గొడవ పడేవాడు. ఇలా కొన్ని రోజులుగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి ఎప్పటిలాగే మద్యం సేవించి రావడంతో అన్నదమ్ముల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరి మీద ఒకరు దాడికి పాల్పడ్డారు. దాంతో తమ్ముడు ఫాయాజ్ కత్తితో అన్న మతిన్ గొంతు కోశాడు.