Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణలో కేసీఆర్ నియంతృత్వ పాలన
- 27న బంద్‌కు పిలుపు: సీపీఐ(మావోయిస్టు) రాష్ట్ర కమిటి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ములుగు జిల్లా వాజేడు మండలం టేకులగూడెం అటవీ ప్రాంతంలో ముగ్గురు మావోయిస్టు నాయకులను బూటకపు ఎన్ఎకౌంటర్ చేశారని ఆ పార్టీ రాష్ట్ర కమిటి అధికార ప్రతినిధి జగన్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు పక్కా సమాచారంతో దళాలను చుట్టుముట్టి దొంగదెబ్బ కొట్టారని తెలిపారు. ఈ దాడిని టీఆర్ఎస్ ప్రభుత్వం పక్కా ప్లాన్‌తో చేయించిందని ఆరోపించారు. విప్లవకారులను హత్యలు చేసి, ప్లీనం పేరిట టీఆర్ఎస్ నెత్తుటి హోళీ ఆడుతున్నదని పేర్కొన్నారు. కేసీఆర్ నియంతృత్వ పాలన సాగిస్తున్నాడని తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాత్ ముఖ్య మంత్రుల భేటీ తరువాత వ్యూహాత్మక సమాధాన్ దాడి లక్ష్యంలో భాగంగా కేసీఆర్ రెట్టించిన ఉత్సాహంతో అణచివేతకు పూనుకుంటున్నారని తెలిపారు.బూటకపు ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఈ నెల 27న బంద్‌ను పాటించాలని విప్లవ శ్రేణులను, ప్రజలను, అన్ని రకాల వ్యాపార యాజమాన్యాలను కోరారు.