Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఏ రాష్ట్ర ప్రభుత్వానికి అయినా బడ్జెట్ ప్రక్రియ అనేది గుండెకాయ లాంటిది. ప్రభుత్వ ఆదాయ, వ్యయాలు, అప్పులు, వడ్డీలు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్ర మాలన్నీ దాంతో ముడిపడి ఉంటాయి. అంతటి కీలకమైన పద్దును 'సీక్రెట్ డాక్యు మెంట్' అని కూడా అంటారు. బడ్జెట్ సమావేశాలకు ముందు అటు కేంద్రంగానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు గానీ ఈ పద్దును, అందులోని సంఖ్యలు, అంకెలు ఎట్టి పరిస్థితుల్లోనూ లీక్ కాకుండా జాగ్రత్తపడతాయి. ఉమ్మడి రాష్ట్రంలోనూ, తెలం గాణలోనూ ఇదే పరిస్థితి. కానీ టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆ సీక్రెట్ డాక్యుమెంట్ను ఓపెన్ చేయటం గమనార్హం. అది కూడా ఈ ఏడాది, వచ్చే ఏడాదికి కాదు.. ఏకంగా 2028 నాటికి తమ ప్రభుత్వం ఎంత మేర బడ్జెట్ను ప్రవేశపెడుతుందనేది లెక్కలతోసహా విడమరిచిచెప్పారు. ఈక్రమంలో ముఖ్య మంత్రి ఊహాశక్తితో చేసిన విశ్లేషణకు ఆర్థిక నిపుణులు సైతం అవాక్కవుతున్నారు.