Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) పోస్టుల కోసం ఆదివారం నిర్వహించిన పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని టీఎస్ఎల్పీఆర్బీ చైర్మెన్ వివి శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆరు కేంద్రాలలో 2341 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారని చెప్పారు. దీనికి సంబంధించిన 'కీ'ని తమ వెబ్సైట్లో ఉంచామని ఆయన వివరించారు. అభ్యర్థులు ఈ 'కీ'ని పరిశీలించి అభ్యంతరాలు ఏవైనా ఉంటే వెబ్సైఐట్లో తమ హాల్ టిక్కెట్నంబర్ను పేర్కొంటూ తెలియజేయాలన్నారు. అందుకు అవసరమైన ఆధారాలనూ అందులో పేర్కొనాలని తెలిపారు.