Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కమిషన్ చైౖర్మెన్పై కాలయాపన ఎందుకు..?
- దళితుల అణిచివేతలో బీజేపీ, టీఅర్ఎస్ అన్నదమ్ములే :
- కేవీపీఎస్ మహాధర్నాలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం ఏజెన్సీ జిల్లాలో మూడెకరాలకు బదులుగా ప్రతి దళిత కుటుంబానికి రూ.21లక్షలు ఇవ్వాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మెన్ నియామకంపై కాలయాపన ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. సోమవారం కేవీపీఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కొత్తగూడెం కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నానుద్దేశించి స్కైలాబ్ మాట్లాడుతూ.. ఎన్నికల నేపథ్యంలో హుజూరాబాద్ మినహా రాష్ట్ర మంతటా 17లక్షల దళిత కుటుంబాలకు దళిత బంధు అందజేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ఏడేండ్ల పరిపాలనా కాలంలో దళితులకు అవగింజంత మేలు జరగలేదు సరికదా అడుగడుగునా అన్యాయమే జరిగిందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు చైర్మెన్‌ను నియమించాలని హైకోర్టు ప్రశ్నించినా ప్రభుత్వం మొద్దునిద్ర లేవడం లేదన్నారు. టీఆర్ఎస్ ప్లీనరీలో ఏడేండ్ల దళితుల అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయలని డిమాండ్ చేశారు. ప్రతి దళిత కుటుంబానికి జీవో నెంబర్ 342 ప్రకారం 101 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వాలనీ, జీవో నెంబర్ 2, 1235 ప్రకారం 2 ఎకరాల శ్మశానవాటికకు స్థలం ఇవ్వాలని ఉన్నా వాటిని అమలుచేయడం లేదని ఆరోపించారు. ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి పథకం కింద రూ.86వేల కోట్లు కాగితాల్లో కేటాయించి రూ.55 వేల కోట్లు ఖర్చు చేసినట్టుగా చూపి రూ.31వేల కోట్లు మురగబెట్టారని ఆరోపించారు. ఎస్సీ కార్పొరేషన్ రుణాలు దరఖాస్తు పెట్టుకున్న వారందరికీ ఎలాంటి షరతులు లేకుండా నిరుద్యోగులకు మంజూరు చేయాలని కోరారు. కేంద్ర బీజేపీ సర్కార్ దళితులకు అన్యాయం చేయడంలో టీఆర్ఎస్తో జత కట్టిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతూ రిజర్వేషన్లకు సమాధి చేస్తుందని విమర్శించారు. అనంతరం జిల్లా ఉపాధ్యక్షులు మచ్ఛా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఏజెన్సీ దళితుల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ ఇచ్చి దృష్టి పెట్టాలని సూచించారు. ధర్నా నుండి ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్ అనుదీప్‌కు సమస్యలతో కూడిన వినతిపత్రం సమర్పించారు. మహాధర్నాకు కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ అధ్యక్షత వహించగా జిల్లా కార్యదర్శి మెరుగు ముత్తయ్య, జిల్లా ఉపాధ్యక్షులు కోడిసెల రాములు, నందిపాటి రమేష్, పిల్లి ఆనంద్, రింగు వెంకటయ్య, మోహన్‌రావు, కుమారి, విజరు, రాజా, రమణ, రాజు తదితరులు పాల్గొన్నారు.