Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలిరోజు 93.5 శాతం హాజరు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రథమ సంవత్సరం పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1కు సెట్ ఏ ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేశామని వివరించారు. 4,59,240 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా, 4,29,177 (93.5 శాతం) మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. 30,063 (6.5 శాతం) మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాలకు పరిశీలకులను పంపించామని వివరించారు. ఈ పరీక్షలు ప్రశాంతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జరిగాయని తెలిపారు. మంగళవారం ఇంగ్లీష్ పేపర్-1 రాతపరీక్ష జరగనుంది.