Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
జూబ్లీ బస్టేషన్ (జేబీఎస్)లోని టిక్కెట్ బుకింగ్ కౌంటర్, రిజర్వేషన్ కౌంటర్, పార్సిల్, కార్గో సెంటర్ల వద్ద యూపీఐ, క్యూఆర్ కోడ్ ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహించుకొనే సౌకర్యం కల్పించినట్టు టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. ఈమేరకు మంగళవారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే సికింద్రాబాద్ రెతీఫైల్ బస్టేషన్, మహాత్మాగాంధీ బస్టేషన్ (ఎమ్జీబీఎస్)ల్లో ఈ సేవల్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించినట్టు వివరించారు. ప్రయాణీకుల నుంచి ఆదరణ వస్తుండటంతో ఈ సేవల్ని రాష్ట్రంలోని అన్ని బస్టేషన్లలో ప్రారంభిస్తామన్నారు. ప్రయాణీకులు మెరుగైన ప్రజారవాణా కోసం సలహాలు, సూచనలను ట్విట్టర్లో ఏ్రత్ీషఎసశీటళషవ కి అందించాలని విజ్ఞప్తి చేశారు.