Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అధికార మదంతో మతిభ్రమించి టీఆర్ఎస్ నేతలు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ ఒక ప్రకటనలో విమర్శించారు. కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండిసంజరుకుమార్, ఎమ్మెల్యే రఘునందన్‌రావు పట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ సంస్కారహీనంగా మాట్లాడటాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. భాషతీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.