Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బొగ్గుబావుల ప్రమాదాల్లో, కోవిడ్‌తో మరణించిన కార్మికులకు రూ.15 లక్షల ప్రత్యేక ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని సింగరేణి కాలరీస్ కంపెనీ, రామగుండం-1 వద్ద నిరసన తెలిపిన కాంట్రాక్టు కార్మికుల కుటుంబ సభ్యులను, కార్మిక సంఘాల నాయకులను పోలీసులు అరెస్టులు చేయడాన్ని సీఐటీయూ ఖండించింది. ఈ మేరకు ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, ఎం.సాయిబాబు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అరెస్ట్ చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2020 ఏప్రిల్ 31న రామగుండం-1, జూన్ 2న రామగుండం-3 ఏరియాల్లో జరిగిన ప్రమాదాల్లో చనిపోయిన కాంట్రాక్ట్ కార్మికులకు సింగరేణి అధికారులు రూ.15 లక్షలు ఎక్స్‌గ్రేషియో చెల్లిస్తామని హామీనిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.