Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రవీంద్రభారతిలో నిర్వహణ
- యువత సద్వినియోగం చేసుకోవాలి:బాలాచారి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఈ నెల 28న 2020 సివిల్స్ విజేతలతో రవీంద్ర భారతిలో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామనీ,ఈ సదావకాశాన్ని సివిల్స్ ప్రిపేరయ్యే యువత సద్వినియోగం చేసుకోవాలని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ నామోజు బాలాచారి మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి బుర్రా వెంకటేశం పాల్గొంటారని తెలిపారు. సివిల్స్‌పై ఆసక్తి ఉన్నవారు 28న మధ్యాహ్నం 2గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమంలో పాల్గొనవచ్చని వారు తెలిపారు. సివిల్స్‌కు ఎలా ప్రిపేర్ కావాలి? ఆప్షనల్‌గా ఎలాంటి సబ్జెక్టులు ఎంపిక చేసుకోవాలి, విజయం సాధించడానికి ఎలాంటి ప్రిఫరేషన్ అవసరమవుతుం ది? అనే ప్రశ్నలకు సమాధానాలను విజేతల ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.