Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మూసీ కాల్వలో మురికి ఎంతుందో రాష్ట్రంలో టీఆర్ఎస్ నేతల అవినీతి అంతలా ఉందని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మెన్ మధుయాష్కీగౌడ్ విమర్శించారు. మంగళవారం గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్లీనరీ మొత్తం పొగడ్తలకే సరిపోయిందనీ, అమరులను గుర్తు చేసుకోలేదని అన్నారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్కు వందలెకరాల భూమిని పోగేసుకున్నాడనీ, ఇతర దేశాల్లో వ్యాపార సామర్థ్యం పెంచుకున్నాడని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు కేసీఆర్ విదేశీ వ్యాపారంపై ఎందుకు తనిఖీలు చేపట్టడం లేదని ప్రశ్నించారు. ఏడేండ్లలో తెలంగాణ ఆత్మహత్యల రాష్ట్రంగా మారిందనీ, అత్యధిక ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్రాల్లో మనది మూడోస్థానమని వివరించారు. సీఎం కేసీఆర్ సొంత జిల్లాలో ఎన్ని ఉద్యోగాలు కల్పించారో చెప్పాలని ప్రశ్నించారు. రాహుకాలం..రావులకాలంలో ప్రజలకు ఏమీ మేలు జరుగదనీ, టీఆర్ఎస్ ప్రభుత్వానికి వీఆర్ఎస్ పలకాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు.