Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఏయే పంటలేయాలనేది కలెక్టర్ నిర్ణయిస్తడా? ఇదేం పద్ధతి? సొంతనిర్ణయాలతో రైతులు సాగు చేసుకోవద్దా? ఏ అధికారంతో సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి బెదిరింపులకు దిగుతున్నాడు? అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. రైతులకు ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.లేదంటే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులను ఇబ్బందిపెట్టే నిర్ణయాలు తీసుకుంటే ఊరుకోబోమని హెచ్చరించారు. వెంకట్రామిరెడ్డి మైండ్‌లో రియల్ ఎస్టేట్ ఆలోచన ఉందని విమర్శించారు. కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ..సిద్ధిపేట కలెక్టర్ రాజ్యాం గేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. లక్షల కోట్ల రూపాయలతో చేపట్టిన ప్రాజెక్టులు టూరిజం కోసమేనా? అని ప్రశ్నించారు. అవగాహన లేని వెంకట్రామిరెడ్డిని కలెక్టర్‌గా ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు.