Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సమాచార హక్కు చట్టం కింద సమాచారమిచ్చే ముందు ఆయా శాఖల అధిపతుల అనుమతి విధిగా పొందాలంటూ ఈ నెల 13న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఆర్టీఐ ఉద్యమకారుడు గంజి శ్రీనివాసరావు, న్యాయవాది రాపోలు భాస్కర్ వేర్వేరుగా పిల్స్ వేశారు. ప్రతివాదులుగా కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలనా విభాగం (జీఏడీ) ముఖ్య కార్యదర్శులను చేర్చారు. సమాచార హక్కు చట్టాన్ని సమర్థవంతంగా అమలు కోసమే ఈ ఉత్తర్వులు ఇచ్చినట్టు సీఎస్ చెబుతున్నారనీ, అయితే ఈ ఉత్తర్వుల వల్ల సమాచారం జాప్యం అవ్వడం ద్వారా సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం అవుతుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సీఎస్ ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేసేలా చూడాలని కోరారు.