Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రాన్ని సర్వ నాశం చేస్తున్న సీఎం కేసీఆర్
- తిమ్మాపురంలో షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష
నవతెలంగాణ-కందుకూరు
రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ అమలు చేయలేదని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా, రంగారెడ్డి జిల్లా, కందుకూరు మండలం తిమ్మాపురం గ్రామంలో మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో లిక్కర్ ఏరులై పారుతుందనీ, నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రూ. 4 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామనీ, నిరుద్యోగ భృతి ఇస్తామనీ, హామీ ఇచ్చి నేటికి అమలు చేయలేదన్నారు. ఓ పక్క రైతులు, నిరుద్యోగులు ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 45 లక్షల మంది ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారని అన్నారు. కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తామని 3500 ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారనీ, 14వేల మంది ఉపాధ్యాయులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.