Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్రాలీ ఆటోను ఢీకొన్న లారీ
- 20 మంది మహిళలకు గాయాలు
- నలుగురి పరిస్థితి విషమం
- వరంగల్ ఎంజీఎంకు తరలింపు
నవతెలంగాణ-హుజురాబాద్ రూరల్
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలో జమ్మికుంట ప్రధాన రహదారిపై మంగళవారం టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా ట్రాలీ ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 20 మంది మహిళలు గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. హుజూరాబాద్ మండలంలోని శాలపల్లి గ్రామం ఇందిరానగర్ కాలనీకి చెందిన 20 మంది మహిళలు ట్రాలీ ఆటోలో టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారు. గ్రామ సమీపంలో ఆటోను హుజూరాబాద్ వైపుగా వస్తున్న లారీ వెనుక నుంచి ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో కనుకం బొందమ్మ, కనుకం ప్రేమలత, జీడి పద్మ, మారెపల్లి సంధ్య, కనుకం సులోచన, కొత్తూరి మానస, ఇనుగాల మమత, ఆకునూరి సుజాత, పొన్నాల సుమలత, జూపాక లావణ్య, లంకదాసరి లావణ్య, శనిగరపు లతతో పాటు పలువురు గాయపడ్డారు. గాయపడిన వారందరికి స్థానిక ఏరియా ఆస్పత్రిలో ప్రథమ చికిత్స బొందమ్మ, లావణ్య, స్వరూప, ప్రవళిక పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.
మంత్రి గంగుల పరామర్శ..
ప్రమాదంలో గాయపడిన వారిని హుజూరాబాద్ ప్రభుత్వాస్పత్రిలో బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, కరీంనగర్ మేయర్ సునీల్‌రావు పరామర్శించారు. ఏరియా ఆస్పత్రి ఆర్ఎంవో డాక్టర్ రమేష్‌ను వివరాలు అడిగి తెలుసుకొన్నారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.