Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రథమ సంవత్సరం పరీక్షలను విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా పరిశీలించారు. హైదరాబాద్‌లోని మహర్షి వేద విజ్ఞాన కాలేజీని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. పరీక్షలు జరుగుతున్న తీరు, ఏర్పాట్లు, కరోనా నిబంధనలను ఆయన పరిశీలించారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంగ్లీష్ పేపర్-1కు సెట్ సీ ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేశామని వివరించారు. 4,59,240 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా, 4,30,563 (93.8 శాతం) మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. 28,677 (6.2 శాతం) మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. సూర్యాపేట, మహబూబ్‌నగర్, జనగామ, మెదక్, కామారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లోని వివిధ పరీక్షా కేంద్రాలకు పరిశీలకులను పంపించామని వివరించారు. ఈ పరీక్షలు ప్రశాంతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జరిగాయని తెలిపారు. బుధవారం మ్యాథమెటిక్స్ పేపర్-1ఏ, బాటనీ పేపర్-1, పొలిటికల్ సైన్స్ పేపర్-1 సబ్జెక్టులకు రాతపరీక్ష జరగనుంది.