Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ. లక్షన్నర ఆస్తినష్టం
నవతెలంగాణ-గాంధారి
ఓ రైతు కుటుంబం ఆరు నెలల కష్టాన్ని దుండగులు బూడిద చేశాడు. వరి కోత కోసి ఆరబెట్టిన ధాన్యానికి గుర్తుతెలియని దుండు గులు నిప్పు పెట్టడంతో రెండున్నర ఎకరాల ధాన్యం దగ్ధమైంది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని ముద్దెల్లి గ్రామంలో మంగళవారం వెలుగుజూసింది. గ్రామానికి చెందిన బల్గురి సుధాకర్‌రావుకు చెందిన 2.30 ఎకరాల భూమిలో ధాన్యం పండించాడు. పంటను కోసి పడుగు పెట్టినాడు. మంగళవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు వరి పంటకు నిప్పు పెట్టాడు. దాంతో పంట పూర్తిగా దగ్ధమైంది. సుమారు లక్షన్నర రూపాయల ఆస్తినష్టం వాటిల్లినట్టు బాధిత రైతు వాపోయాడు. ఆరుగాలం కుటుంబం మొత్తం చేసిన కష్టం బూడిద పాలైనదని బోరుమన్నాడు. పాలకులు, అధికారులు స్పందించి ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.