Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్పంచుల సంఘం ఉపాధ్యక్షులు
సుర్వి యాదయ్యగౌడ్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
పట్టణాల్లో బస్తీ దవాఖానాల మాదిరే గ్రామీణ ప్రాంతాల్లో పల్లె దవాఖానాలు ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సుర్వి యాదయ్యగౌడ్ విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్ పార్టీ 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారిస్తే, ప్రజల నుంచి విశేష ఆదరణ, స్పందన వస్తాయని చెప్పారు. తొమ్మిదోసారి టీఆర్ఎస్ అధ్యక్షులుగా సీఎం కేసీఆర్ ఎన్నికకావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తంచేసి, అభినందనలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు, ఉచిత పరీక్షలు అందుబాటులోకి వస్తే, ప్రజలకు మరింత మెరుగైన జీవనం లభిస్తుందన్నారు. ఈ మేరకు ప్రణాళికలు రూపొందించి, సాధ్యమైనంత త్వరగా అమల్లోకి తేవాలని కోరారు.