Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎస్ సోమేశ్ కుమార్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో వందశాతం లక్ష్యాన్ని సాధించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేసేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. వ్యాక్సినేషన్ పై మంగళవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటన్, రష్యా, ఉక్రెయిన్, బ్రెజిల్, జర్మనీ, నెదర్లాండ్, చైనా లో కోవిడ్ వైరస్ మరో రూపంలో తిరిగి ప్రబలుతుందని తెలిపారు. వ్యాక్సినేషన్ ముమ్మరం చేసేందుకు వీలుగా ఆశా వర్కర్, అంగన్వాడీ వర్కర్, పంచాయతీ కార్యదర్శి, వీఆర్ఏలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలనీ, ప్రతి గ్రామానికి ఒక నోడల్ అధికారిని, మండలానికి ఒక ప్రత్యేకాధికారిని నియమించాలని సూచించారు. వాక్సిన్ డోసులు, సిరంజీలు సరిపడా ఉన్నాయని స్పష్టం చేశారు. కోవిడ్ మహమ్మారి నుంచి కాపాడేందుకు కేవలం రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకోవడమే ఏకైక మార్గమని ప్రజలకు అర్థమయ్యేలా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర వైద్యారోగ్యశాఖతో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.