Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇప్పుడున్నయి ఏమన్నా ఆగుతయా...?
- గీత కార్మికులకు ఎప్పుడో ఒకప్పుడు ద్విచక్ర వాహనాలనిస్తం : శ్రీనివాస్‌గౌడ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'రాష్ట్రంలోని కల్లుగీత కార్పొరేషన్‌కు పాలకమండలి(నామినేటెడ్ బాడీ)ని నియమించకపోతే ఏమైతది...'అని రాష్ట్ర ఎక్సైజ్, ఆబ్కారీ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. పాలక మండలి లేకపోతే ఇప్పుడున్న పథకాలన్నీ ఆగుతయా...? అని మంగళవారం హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన ఎదురు ప్రశ్నించారు. ఏడేండ్ల కాలంలో బీసీ, ఎంబీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేశాం, కుల వృత్తులను బలోపేతం చేశామంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో అదే ఏడేండ్ల కాలంలో కల్లుగీత కార్పొరేషన్‌కు పాలక మండలిని ఎందుకు నియమించలేదంటూ విలేకర్లు అడగ్గా... ఆయన పై విధంగా స్పందిం చారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నారనీ, ఎవరెవర్ని పాలక మం డలిలో నింపాలనే విషయంపై ఆలోచించి ప్రభుత్వం తగు నిర్ణయం తీసు కుంటుందని వివరించారు. మత్స్య కార్మికులకు మాదిరిగా గీత కార్మికులకు ద్విచక్ర వాహనాలను ఇచ్చే ఆలోచన ఉందా...? దీనిపై ప్రభుత్వం గతంలో హామీనిచ్చింది కదా? అని అడగ్గా 'ఇస్తం... ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా' అంటూ దాటవేశారు. సోమవారం నిర్వహించిన టీఆర్ఎస్ ప్లీనరీపై కాంగ్రెస్, బీజేపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. తమ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం సరికాదని హితవు పలికారు. ఆ రెండు పార్టీలకు సంబంధించిన అంతర్గత విషయాల్లో మేమేమైనా జోక్యం చేసుకుంటున్నామా...? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి, మంత్రి కేటీఆర్ గురించి పీసీసీ చీఫ్ రేవంత్, వ్యక్తిగత విమర్శలకు దిగటం ఆయన స్థాయికి తగదని విమర్శించారు. బీసీ జన గణన, ఎస్సీ రిజర్వేషన్ల పెంపు తదితరాంశాలపై ప్లీనరీలో తీర్మానాలు చేశామని గుర్తు చేశారు. వీటిని అమలు చేయాలంటూ రేవంత్... కేంద్రంలోని బీజేపీని ఎందుకు డిమాండ్ చేయటం లేదన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో నూటికి నూరు శాతం గెలుస్తామంటూ శ్రీనివాస్‌గౌడ్ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.