Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ప్రముఖ ఔషద ఉత్పత్తుల కంపెనీ గ్లెన్మార్క్ ఫార్మా మధుమేహ వ్యాధికి కొత్తగా ఒక మిశ్రమ ఔషధాన్ని ఆవిష్కరించింది. 'రెమో గ్లిఫ్లోజిన్ 100 ఎంజి, విల్దాగిన్ 50 ఎంజి, మెట్ ఫార్మిన్ 500/ 1000 ఎంజి స్థిర మోతాదు ఔషదాలను విడుదల చేసినట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మందు మధుమేహాన్ని నియంత్రించడంలో సమర్థంగా పని చేస్తుందని పేర్కొంది. ప్రస్తుతం ఈ ఔషధాలు వాడేందుకు రోజుకు రూ.75 వరకు అవుతోందని తెలిపింది. కానీ తాము ఒక్కో మాత్రను రూ.16.50కే ఇస్తున్నామని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా దీన్ని తొలిసారిగా ఆవిష్కరించిన ఘనత తమదేనని గ్లెన్మార్క్ ఫార్మా పేర్కొంది. ముఖ్యంగా ఇది టైప్ 2 మధుమేహంతో బాధపడుతున్న పెద్దలకు అత్యంత అందుబాటు ధరలో లభించనుందని తెలిపింది. దీంతో మధుమేహ వ్యాధిగ్రస్తులకు నెలకు అయ్యే ఖర్చు తగ్గుతుందని తెలిపింది.