Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిందితునిపై కేసు నమోదు
నవతెలంగాణ-మద్దిరాల
మహిళపై లైంగికదాడి జరిగిన సంఘటన సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఏఎస్ఐ నాగయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మద్దిరాల గ్రామానికి చెందిన వివాహిత అదే గ్రామనికి చెందిన రైతు శేరి సాకేత్ రెడ్డి వద్ద కోళ్లఫామ్‌లో పని చేస్తుంది. బుధవారం కోళ్లకు వేసే ఫీడ్‌ను తీసుకురమ్మని నమ్మబలికి రూమ్‌లోకి వెళ్లగానే తలుపులు పెట్టి ఆమెపై లైంగికదాడికి పాల్ప డ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.