Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమ్మాయి పుట్టిందని వదిలేసిన గుర్తు తెలియని వ్యక్తులు
- వీఆర్వో శ్రీనివాస్ చొరవతో స్థానిక ఆరోగ్య కేంద్రానికి తరలింపు
- సిద్దిపేట ఆస్పత్రికి పసికందు తరలింపు
నవతెలంగాణ-బెజ్జంకి
మానవత్వం మంటగలి పెలా... కర్కశంగా వ్యవహరిం చిన గుర్తు తెలియని వ్యక్తులు.. అభం శుభం తెలియని పసికందును ముళ్లపొదల్లో వదిలేశారు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. తోటపల్లి ఆన్లైన్ రిజర్వాయర్ సమీపంలో దట్టమైన ముళ్లపొదల్లో పసికందు ఆరుపులు వినిపించడంతో కాలకృత్యాలకు వెళ్లిన స్థానికులు గమనించారు. వెంటనే ముళ్లపొదల్లోని ఆడశిశువును వెలికి తీశారు. పాపను చూసిన పలువురిని కంటతడికి గురిచేసింది. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న వీఆర్వో శ్రీనివాస్ పసికందును అక్కున చేర్చుకుని వీఆర్ఏలు, గ్రామస్తుల సహాయంతో స్థానిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. సమాచారం తెలుసుకున్న సర్పంచ్ బోయినిపల్లి నర్సింగరావు, పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. డాక్టర్ లింగారెడ్డి పసికందుకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం పాపను సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పసికందు ఆరోగ్యం నిలకడగానే ఉందనీ, శిశుసంరక్షణ కేంద్రానికి తరలించామని ఐసీడీఎస్ సూపర్ వైజర్ జయమ్మ తెలిపారు.