Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేటీఆర్ ఆహ్వానం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఫ్రాన్స్‌లో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగుతున్నది. గురువారం పలు కంపెనీల సీఈవోలు, పరిశ్రమల అధిపతులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మిస్సైల్స్ ఎంబీడీఏ కంపెనీ ప్రతినిధులు, ఏరో క్యాంపస్ అక్విటిన్ సంస్థ ప్రతినిధులతో ఆయా సమావేశాల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు పెట్టేందుకు ఉన్న అవకాశాలు, వాటిని ఆకర్షించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై మంత్రి కేటీఆర్ వివరించా రు. రాష్ట్రంలో పర్యటించాలని ఎంబీడీఏ ప్రతినిధి బృందాన్ని ఆహ్వానించారు.అనంతరం ఫ్రాన్స్‌లోని భారత రాయబారి జావెద్ అష్రఫ్తో భేటీ అయ్యారు. ఫ్రెంచ్ కంపెనీలకు తెలంగాణలో అవకాశం ఉన్న రంగాల గురించి వివరించారు. అలాగే పారిస్‌లో కాస్మోటిక్ వ్యాలీ డిప్యూటీ సీఈఓ ఫ్రాంకీ బెచెరోతోనూ కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారత్‌లో సౌందర్య సాధనాల మార్కెట్, గణనీయమైన వద్ధితో పాటు తెలంగాణలో కాస్మోటిక్ తయారీకి ఉన్న అవకాశాలను వివరించారు. కేటీఆర్ వెంట పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ డైరెక్టర్ ప్రవీణ్, డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం ఉన్నారు.