Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కొత్తగా 171మందికి కరోనా సోకగా, ఆ వ్యాధి నుంచి 208 మంది మాత్రమే కోలుకున్నారు. ఒకరు మరణించారు. బుధవారం సాయంత్రం 5.30 గంటల నుంచి గురువారం సాయంత్రం 5.30 గంటల వరకు 38,373 మందికి టెస్టులు చేసినట్టు కోవిడ్-19 మీడియా బులెటిన్ వెల్లడించింది. ప్రభుత్వాస్పత్రుల్లో 33,375 మందికి, ప్రయివేటు ఆస్పత్రుల్లో 4,998 మందికి పరీక్షలు నిర్వహించారు. మరో 1,702 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 4, 126 యాక్టివ్ కేసులున్నాయి. జిల్లాల వారీగా చూస్తే జీహెచ్ఎంసీలో అత్యధికంగా 58 మందికి కరోనా సోకింది. అతి తక్కువగా రెండు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఈ వ్యాధి బారిన పడ్డారు. మరో తొమ్మిది జిల్లాల్లో ఒక్క కేసు నమోదు కాలేదు.